Goodachari 2 | అడివిశేషు నటించిన బ్లాక్బాస్టర్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ విడుదలై అరేళ్లు పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు అడివిశేషు. షూటింగ్ కూడా 40శాతం పూర్తయింది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర ప్రకటించారు. ఓ వైపు మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా ‘గూఢచారి2’ (జీ2)కు సంబంధించిన ఆరు ైస్టెలిష్ యాక్షన్ మూమెంట్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా అడవిశేషు మాట్లాడుతూ ‘ ఆరేళ్లనుంచీ ఈ సినిమా ప్రశంసలు వింటూనే ఉన్నా. ఇప్పుడు చేస్తున్న సీక్వెల్ దాన్ని మించేలా ఇంటర్నేషనల్ స్కేల్లో ఉంటుంది. ‘గూఢచారి’ అభిమానులకు ‘జీ2’ ఓ విజువల్ ట్రీట్’ అన్నారు. ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని దర్శకుడు వినయ్‌కుమార్ సిరిగినీడి చెప్పారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ‘గూఢచారి2’(జీ2) ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఇమ్రాన్హష్మీ, మురళీశర్మ, సుప్రియ యార్లగడ్డ, మధుశాలిని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: అమ్మీజ్ అహ్మద్.