Bigg Boss 8 Telugu | తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా నటి యష్మీ గౌడ బీబీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో రెండు సినిమాలు హీరోగా చేశానని.. తనకు విలన్ రోల్స్ అంటే తనకు ఇష్టమని నిఖిల్ తెలిపారు. మూడో కంటెస్టెంట్‌గా సిద్దిపేట కుర్రాడు అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చారు. ‘పెళ్లి చూపులు’ సినిమాలో విష్ణుగా పేరు తెచ్చుకున్న అభయ్ నవీన్. పలు సినిమాల్లో నటించారు. రామన్న యూత్ మూవీతో హీరోగా, దర్శకుడిగా కొత్త అడుగు వేసిన అభయ్ తాజాగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అభయ్ నవీన్ స్టేజి మీదకు వచ్చిన తర్వాత నాగార్జున ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చారు.
అభయ్ వైఫ్ వీడియో ప్లే చేశారు. అందులో తన భర్తకు కోపం ఎక్కువ చెప్పింది. అభయ్ నవీన్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ పూర్తి కాగానే బ్యాంకు ఉద్యోగం వచ్చింది. అయితే, చలాకీ మాటలతు అందరికీ నచ్చడంతో తోటి ఉద్యోగులు సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అయితే, ఓ వైపు ప్రమోషన్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బొమ్మల రామారం మూవీలో నటించి.. ఆ తర్వాత పెళ్లిచూపులు మూవీలో ఫ్రెండ్‌గా నటించాడు. పలు సినిమాలు చేసిన అభయ్.. ఆ తర్వాత ఓ కథ రాసుకున్నాడు. ఆ కథ బాగుందని చెప్పినా.. చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. సినిమా రిలీజ్‌కు ముందు అతని తండ్రి మరణించాడు.
మూడేళ్ల నిరీక్షణ అనంతరం ‘రామన్న యూత్’ మూవినీ రిలీజ్ చేశాడు. డైరెక్టర్‌గా తొలి సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నాలుగో కంటెస్టెంట్‌గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం బీబీహౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ సాంగ్‌లతో అలరించింది. అనంతరం చలాకీగా సమాధానాలు చెబుతూ అలరించింది. నలుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ‘35 చిన్న కథకాదు’ హీరోయిన్ నివేదా థామస్, రాణా దగ్గుబాటు స్టేజ్‌పైకి వచ్చారు. రాయలసీమ నేపథ్యంలో ఎలాంటి వయలెన్స్ లేకుండా తీసిన సినిమా నివేదా తెలిపింది. బావ మరదళ్ల.. భార్య భర్తల మధ్య రొమాన్స్, చిన్న పిల్లల చదువులు సినిమాలో చూపించామని వివరించింది. ఈ సందర్భంగా నాగ్ స్టేజ్‌పైనే ‘35 – చిన్న కథ కాదు’ ట్రైలర్ విడుదల చేశారు. ఆ తర్వాత బీబీ హౌస్‌లోకి ఎంట్రీ రాణా, నివేదా.. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ముచ్చటించి.. ఆటలాడించారు.