Vaddepalli Srinivas | హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని తన నివాసంలో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చనిపోయారు. శ్రీనివాస్ మృతిపట్ల జానపద కళాకారులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 100కు పైగా సాంగ్స్, ప్రయివేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ ఆలపించారు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాలో గన్నులాంటి పిల్ల అనే పాటతో ఆయన పాపులర్ అయ్యాడు. ఆ పాటకి గానూ ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు.