దీపుజాను, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ ఆల్బమ్ ‘ఫస్ట్‌లవ్’. బాలరాజు ఎం దర్శకత్వం వహించారు. వైశాలిరాజ్ నిర్మాత. ఈ ఆల్బమ్‌లోని ఓ గీతాన్ని సంగీత దర్శకుడు తమన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాటలో అద్భుతమైన కథను చూపించారని, ఓ మంచి లవ్మూవీ చూసిన అనుభూతికలిగిందని, విజువల్స్ కూడా బ్యూటీఫుల్‌గా ఉన్నాయని చెప్పారు.
సిధ్‌శ్రీరామ్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందని, మనసుకు హత్తుకునే గీతమిదని దర్శకుడు బాలరాజు తెలిపారు. టీమ్ అందరం ఎంతో ఇష్టంతో ఈ పాటను తీర్చిదిద్దామని హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ పేర్కొంది. ఈ ఆల్బమ్‌కు సంజీవ్ టి సంగీతాన్నందించారు.