Bindu Madhavi | విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కుతున్నది. స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ శ్రీవాస్తవయ దర్శకుడు. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. విశ్వదేవ్ రాచకొండ, బిందుమాధవి ఈ లుక్‌లో అల్ట్రా మోడరన్‌గా ఆకట్టుకున్నారు. పోస్టర్‌పై ‘జానర్ అడగొద్దు.. మాక్కూడా తెలీదు’ అనే క్యాప్షన్ కథపై ఆసక్తిని పెంచుతున్నది. వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతున్నదని మేకర్స్ తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్, సౌండ్ మిక్స్: అజిత్ అబ్రహం జార్జ్.