లోకనాయకుడు కమల్ హాసన్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఇండియన్ 2 సినిమాకి బ్రేక్ పడింది. అయితే మాస్టర్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న విక్రమ్ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది కమల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో కమల్ హాసన్‌తో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నారు.
తన కెరీర్లో 232వ చిత్రంగా వస్తున్న విక్రమ్ సినిమాను కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ అప్పుడే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. తన ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ ప్రచారంలో బిజీ అయిపోయాడు కమల్. కానీ ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం వచ్చింది. ఆయనతో సహా మక్కల్ నీధి మయ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరూ ఓడిపోయారు. దీంతో మళ్లీ కమల్ సినిమాలపై ఫోకస్ చేశారు. విక్రమ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఒకవైపు విజయ్ సేతుపతి.. మరోవైపు ఫహాద్ ఫాజిల్ ఉండగా.. మధ్యలో కమల్ హాసన్ ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. పోస్టరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Vikrammmmmmm 🔥🔥🔥
— Anirudh Ravichander (@anirudhofficial) July 10, 2021
Gonna be a feast from @ikamalhaasan sir @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil #Vikram #VikramFirstLook#Arambichitom pic.twitter.com/hzJ9jW8qzS
ఖైదీ, మాస్టర్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత లోకేష్ కనకరాజ్ చేస్తున్న సినిమా విక్రమ్. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ‘విక్రమ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజయాలు లేని కమల్ హాసన్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
ఓటీటీలో సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు ఎందుకు.. డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం