స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ రావురమేశ్ హీరోగా మారారు. ఆయన కథానాయకుడిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ పేరుతో సినిమా రానుంది. ఇంద్రజ ఇందులో కథానాయిక. లక్ష్మణ్ కార్య దర్శకుడు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు చెందిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం వినూత్నంగా ప్రేక్షకుల ద్వారా విడుదల చేశారు.
ఈ లుక్‌లో గళ్లచొక్కా, లుంగీతో మాస్ అవతారంలో కనిపిస్తున్నారు రావు రమేశ్. ‘రావురమేశ్ ఇందులో కొత్తగా కనిపిస్తారు. వినోదం, భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుంది. రావు రమేశ్ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తున్నది’ అంటూ దర్శక, నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు. నటుడిగా తనకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చిన ప్రేక్షకులే తన ఫస్ట్‌లుక్‌ని ఆవిష్కరించడం పట్ల రావు రమేశ్ సంతోషం వ్యక్తం చేశారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్దన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి.