ఓవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే..మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో ముందుకొస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సంస్థ నుంచి వస్తున్న మరో చిత్రం ‘విసా-వింటారా సరదాగా’. అశోక్ గల్లా, శ్రీగౌరీప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రధారులు.
ఉద్భవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘అమెరికా నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి భారతీయ విద్యార్థుల జీవితాలను ఆవిష్కరిస్తుంది. స్నేహం, ప్రేమ, సందిగ్ధతలు, సాంస్కృతికపరమైన మార్పులను హృద్యంగా ఆవిష్కరిస్తూ వినోదప్రధానంగా సాగుతుంది. నేడు టీజర్‌ను విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.