Andhra King Taluka | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ నుంచి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ ప్రోమో (First Day First Show Promo)ను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి పాట ఈ బుధవారం విడుదల కాబోతుంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పి. మహేశ్‌బాబు (‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.