Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ రోల్లో నటిస్తోన్న మూవీ జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో విడుదల కానుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రం జనవరి 9నే వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది.
సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన బావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆర్మీ దళాలను సమస్యాత్మక కోణంలో చూపించారని సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ రివైజింగ్ కమిటీ ముందు ఉంది. రాబోయే రోజుల్లో రివైజింగ్ కమిటీ సినిమా చూడనుండగా.. ఆ తర్వాత సెన్సార్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. సెన్సార్ షిప్ సమస్యల కారణంగా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియో జననాయగన్ ఓటీటీ డీల్‌ను రద్దు చేసుకుందంటూ న్యూస్ కూడా తెరపైకి వచ్చింది.
జననాయగన్ విడుదలపై నెలకొన్న డైలామాకు ఓ క్లారిటీ వచ్చినట్టు తాజా కథనం ఒకటి చెబుతోంది. తాజా టాక్ ప్రకారం జననాయగన్ ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు థ్రియాట్రికల్ రైట్స్ కూడా చేతులు మారనున్నాయట. కేవీన్ ప్రొడక్షన్స్ మొదట టాక్సిక్ను విడుదల చేసి ఆ తర్వాత జననాయగన్‌పై ఫోకస్ పెట్టాలని ప్లాన్ చేస్తుందట. అంతేకాదు ఓటీటీ ప్లాట్‌ఫాం కూడా మారే అవకాశాలున్నాయని ఇన్సైడ్ టాక్. మొత్తానికి రాబోయే రోజుల్లో దీనిపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లైన్లో ఉండబోతున్న ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీ రోల్ చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో చివరి సినిమాగా వస్తోంది జననాయగన్.
‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య