Nidhhi Agerwal | ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్టందుకుంది నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తుందని తెలిసిందే. వీటిలో ఒకటి పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహరవీరమల్లు కాగా.. మరోవైపు ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న రాజాసాబ్.
ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం ఈ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక ఈ రెండు ప్రాజెక్టులపై పూర్తి ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్‌కు వరుస వాయిదాలు నిరాశనే మిగులుస్తూ వస్తున్నాయి. హరిహరవీరమల్లు రీషెడ్యూల్ చేయడంతో నిధి అగర్వాల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఫైనల్‌గా నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది.
మే 21న కొత్త పాట లాంచ్‌తో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. నిధి అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండి ప్రమోషన్స్‌పైనే ఫోకస్ పెట్టినట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. హరిహరవీమల్లు నాలుగేళ్లుగా సెట్స్‌పై కొనసాగుతుండగా.. నిధి తన కెరీర్లో అగ్రభాగం ఈ ప్రాజెక్టుకే కేటాయించింది. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత తమ అభిమాన నటి నిధి అగర్వాల్ మళ్లీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతుండటంతో అభిమానులు, ఫాలోవర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు.
Raashi Khanna | సినిమాలంటే ఆసక్తి లేదట.. తన రూంమేట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన రాశీఖన్నా
Ruchi Gujjar | మోదీ నెక్లెస్‌తో కేన్స్‌లో సందడి చేసిన బాలీవుడ్ భామ.. అందరి చూపు ఆమె వైపే