ఈ ఏడాది రెండు నెలల తేడాతో రెండు సినిమాలతో పలకరించి అభిమానుల ఆకలి తీర్చేశారు పవన్‌కల్యాణ్. ముఖ్యంగా ఆయన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ స్పీడ్‌లోనే తన తదుపరి సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’కి సంబంధించిన తన పోర్షన్ మొత్తాన్నీ కూడా పూర్తి చేశారు వపన్ కల్యాణ్. అయితే.. పవన్ లేని సన్నివేశాలు కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే మొదలుపెట్టనున్నారు. అలాగే డిసెంబర్ నుంచి ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేయనున్నట్టు దర్శకుడు హరీశ్‌శంకర్ రీసెంట్గా పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. జనవరిలో చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’, మార్చిలో రామ్‌చరణ్ ‘పెద్ది’ రిలీజ్లు ఉన్న విషయం తెలిసిందే. వాటి తర్వాతే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ని విడుదల చేయడం సబబుగా ఉంటుందని చిత్రబృందం భావించారట. ఈ లోపు మిగిలిన పార్ట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్నూ పూర్తిచేస్తారట.