Pritish Nandy | చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, నిర్మాత (Filmmaker) ప్రితీశ్ నంది (Pritish Nandy) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ఆయన ఓ ప్రముఖ జర్నలిస్ట్ కూడా. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, ప్రితీశ్ నంది స్నేహితుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
‘నాకు అత్యంత ప్రియమైన, సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రితీశ్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్’ అని అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రితీశ్ నంది మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
కాగా జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రితీశ్ రచయితగా, నిర్మాతగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో రాజ్యసభ ఎంపీగా కూడా వ్యవహరించారు. ప్రితీశ్ సుర్, కాంటే, ఝంకార్ బీట్స్, చమేలీ, హజారోన్ ఖ్వైషీన్ ఐసీ, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
Deeply deeply saddened and shocked to know about the demise of one of my dearest and closest friends #PritishNandy! Amazing poet, writer, filmmaker and a brave and unique editor/journalist! He was my support system and a great source of strength in my initial days in Mumbai. We… pic.twitter.com/QYshTlFNd2
— Anupam Kher (@AnupamPKher) January 8, 2025
Also Read..
Shraddha Srinath | నా బలమేమిటో తెలుసు.. నటన ద్వారానే ప్రేక్షకులకు గుర్తుండితా: శ్రద్ధా శ్రీనాథ్
Congress Govt | గేమ్ ఛేంజ్.. బెనిఫిట్ షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్