న్యూఢిల్లీ: భాలీవుడ్ నటుడు గోవింద(Govinda), ఆయన భార్య సునితా అహుజా.. విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 37 ఏళ్ల వైవాహిక బంధానికి వాళ్లు బ్రేకప్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఓ టీవీ న్యూస్ రిపోర్టు ప్రకారం ఆ జంట చాన్నాళ్ల నుంచి విడివిడిగాఉంటున్నారు. అయితే డైవర్స్ అంశంపై గోవింద కానీ ఆయన భార్య సునితా కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గోవింద, సునితా అహుజా లైఫ్ స్టయిల్ భిన్నంగా ఉంటుంది, దీని వల్లే ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. అయితే ఓ మరాఠీ నటితో గోవింద అఫైర్ పెట్టుకోవడం వల్ల విడాకులు తీసుకోవాల్సి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇద్దరం వేర్వేరు ఇండ్లలో ఉంటున్నట్లు సునితా తెలిపారు. పొద్దుపోయిన తర్వాత కూడా గోవింద .. మీటింగ్లు పెడుతుంటారని ఆమె చెప్పారు.
వచ్చే జన్మలో మాత్రం గోవింద నా భర్తగా రావాలని కోరుకోవడం లేదని సునితా తెలిపారు. హాలీడేస్ టైంలో అతను తనతో రాడు అని, భర్తతో బయటకు వెళ్లి పానీపురి తినాలన్న ఆశ ఉన్నదాన్ని అని, వర్క్ కోసమే అతను ఎక్కువ టైం కేటాయిస్తుంటాడని, ఇద్దరు కలిసి సినిమాకు వెళ్లిన సందర్భమే లేదని ఆమె చెప్పారు.
1987 మార్చిలో గోవింద, సునితా అహుజా పెళ్లి చేసుకున్నారు. 1988లో వారిని కూతురు టీనా జన్మించింది. 1997లో యశ్వర్ధన్ పుట్టాడు.