‘హాలీవుడ్లో సింగిల్ షాట్ టెక్నిక్‌లో తెరకెక్కిన బర్డ్మన్, 1917 చిత్రాల తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్‌తో తీసినా చాలా క్యారెక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ మా చిత్రంలో ఒకే పాత్రతో రన్ అవుతుంది’ అన్నారు దర్శకుడు రాజు దుస్సా. కథానాయిక హన్సికతో ఆయన దర్శకత్వంలో సింగిల్ క్యారెక్టర్‌తో రూపొందుతున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ ‘ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. హన్సిక తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఆమె కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సిఎస్.