రాష్ట్రంలో తుగ్లక్ పాలన
తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక.. హామీలను అమలు చేయలేక తుగ్లక్‌లా ఆలోచిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- జిల్లాను రద్దు చేస్తే ఉద్యమానికి సిద్ధం
- సీఎం మరోసారి ఆలోచించుకోవాలి
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, మే 3 : తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక.. హామీలను అమలు చేయలేక తుగ్లక్‌లా ఆలోచిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలను రద్దు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నాడని.. అలాంటి ఆలోచనలను ఉపసంహరించుకోవాలని సూచించారు. కాదని జిల్లాల రద్దుకు పూనుకుంటే ప్రజాగ్రహంతోపాటు అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. నడిగడ్డ జిల్లాను కాపాడుకోవడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి మరో ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే సదుద్దేశంతో కేసీఆర్ జిల్లాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారన్నారు. పాలన సవ్యంగా సాగుతున్న సమయంలో సీఎం తుగ్లక్‌లా ఆలోచిస్తూ జిల్లాల పునర్విభజన చేస్తామంటున్నాడని.. దీనిని ఉపసంహరించుకోవాలని సూచించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడని ఆగ్రహం వ్య క్తం చేశారు. కాంగ్రెస్ ధికారంలోకి వచ్చా క ప్రజలు కరువుతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా పాలనను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. సాగు, తాగునీటిపై సమీక్ష చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే సీఎం మరో తెలంగాణ ఉద్యమాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ల రద్దుపై ఆయన మరోసారి ఆలోచించుకోవాలన్నా రు. కేసీఆర్ ఆనవాలు చెరిపేసేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న ఈ తుగ్లక్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు అడ్డుకోవాలన్నారు. ఈ ప్రభావం నిరుద్యోగ యు వత, ఉద్యోగులు, జోనల్ వ్యవస్థపై పడే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని గ్రహించి అన్ని వర్గాల ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, మురళి, నాయకులు గోవిందు, సాయిశ్యాంరెడ్డి, కురుమన్న, మహబూబ్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

