కాంగ్రెస్‌కు పాలన చేతకాదు
సమర్థవంతమైన పాలన చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం కౌడిపల్లి, కొల్చా రంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు.
- హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత మోసం చేసింది..
- కౌడిపల్లి, కొల్చారం రోడ్‌షోలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
- కార్యకర్తలు బెదరొద్దు.. అండగా నేనున్నా: ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
- రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడతా: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి
నర్సాపూర్/చిలిపిచెడ్(కొల్చారం), మే 3: సమర్థవంతమైన పాలన చేయడం కాంగ్రెస్‌కు చేతకాదని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా శుక్రవారం కౌడిపల్లి, కొల్చా రంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధాన్యానికి బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదన్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు అప్పు చేయకుండా వ్యవసాయం చేసే స్థాయికి ఎదగాలని కేసీఆర్ రైతుబంధు ప్రవేశపెట్టి చేయూత నిచ్చారన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం లేదన్నారు.
ఎవరికీ భయపడేది లేదు: సునీతాలక్ష్మారెడ్డి
కొందరు నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను బయపెడుతున్నారని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తాను మహిళనే కావ చ్చు కానీ ఉక్కు మహిళనని నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. కాంగ్రె స్లో చేరిన నాయకులతో బీఆర్ఎస్కు ఎలాం టి నష్టం లేదని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఈసారి డబుల్, ట్రిఫుల్ మెజార్టీ వస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. నర్సాపూర్ రోడ్‌షోలో మండల నాయకులు మన్సూర్, చంద్రాగౌడ్, గోపి, రామాగౌడ్, కొల్చారం రోడ్‌షోలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, నాయకులు సంతోష్‌రావు, రవితేజరెడ్డి, శ్రీధర్, దుర్గాప్రసాద్‌గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్ కరెంట్ ఉమాదేవి రాజాగౌడ్, కొమ్ముల యాదాగౌడ్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు: వెంకట్రామిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నదని, వాటికి భయపడేది లేదని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రూ.100 కోట్లతో ట్రస్ట్ ఏర్పా టు చేసి పేదలకు, యువతకు, మహిళలకు, నిరుద్యోగులకు సేవా కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్‌షోకు పెద్దసంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భయపడాల్సిన పనిలేదని, కార్యకర్తలు ఆపదలో ఉంటే గంటలో మీ ముందుంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలపై పోలీస్ జులూం ఎలా ఎదిరించాలో మాజీ కలెక్టర్‌గా తనకు తెలుసన్నారు. అధికారిగా, విద్యావంతుడిగా ప్రజాసేవ చేయ డం తెలుసన్నారు. నర్సాపూర్ పట్టణంలో ఓ ఫంక్షన్‌హాల్ కట్టించి పేదింటి శుభకార్యాలకు ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థిని, విద్యార్థులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలు రాయడానికి దోహదపడతానని తెలిపారు. ఎంపీగా నిలబడిని ముగ్గురి అభ్యర్థులలో గుణగణాలను చూసి ఆశీర్వదించాలని కోరారు. నిలకడలేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి అని, అబద్ధ్దాలు చెప్పే వ్యక్తి రఘునందన్‌రావు అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

