ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గురువారం ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. స్వాతంత్రోద్యమ కాలం నాటి ఈ కథలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.
యుద్ధం, త్యాగం, దేశభక్తి, ప్రేమ ప్రధానాంశాలుగా హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నదని, సినిమా పూర్తయ్యేంత వరకు నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్ కొనసాగుతుందని దర్శకుడు పేర్కొన్నారు. ఇమాన్వీ, అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి.