Faria Abdullah | జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ సినిమాలో తన నటన, కామెడీ టైమింగ్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది ఫరియా. జాతిరత్నాలు సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. దీనికి తగ్గట్టే మాస్ మహారాజా రవితేజతో పాటు మరో రెండు సినిమాల్లో ఫరియా అబ్దుల్లాకు ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవేవీ కన్ఫర్మ్ అవ్వలేదు. కాకపోతే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో అలా మెరిసింది. కానీ హీరోయిన్గా మాత్రం పెద్దగా ఆఫర్లు రాలేవు. మన హీరోలు కూడా ఫరియా అబ్దుల్లాను హీరోయిన్గా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అందుకు ఆమె హైట్ కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫరియా ఎత్తు కారణంగానే ఆమెకు ఛాన్స్‌లు రావడం లేదని సోషల్‌మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాకు బంపర్ ఆఫర్ వచ్చింది. సూపర్ హిట్ ఢీ సినిమా సీక్వెల్లో హీరోయిన్గా ఫరియాకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో 2007 వచ్చిన ఢీ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మంచు విష్ణు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిస్ట్. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ చూస్తుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. అలాంటి సినిమాకు దాదాపు పద్నాలుగేండ్ల విరామం తర్వాత సీక్వెల్ రాబోతోంది. ఢీ అండ్ ఢీ ( డబుల్ డోస్ ) పేరుతో శ్రీను వైట్ల సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడీగా కోమలిని ఎంపిక చేశారు. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్‌కు కూడా ఛాన్స్ ఉందంట. ఆ పాత్ర కోసం హైదరాబాదీ సొగసరి ఫరియా అబ్దుల్లాను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలిసింది. తన క్యారెక్టర్ నచ్చడంతో ఫరియా కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో అయినా ఫరియా అబ్దుల్లాకు కలిసి వస్తుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Faria Abdullah | రెడ్ శారీలో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
Pushpa: పుష్ప మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారా.. డిసెంబర్ 17న రావడం కష్టమేనా?
priyanka chopra | ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదెంతో తెలుసా?
తన కంటే చిన్నవాడితో డేటింగ్‌పై రష్మిక ఏమన్నదంటే..?