జాతిరత్నాలు (Jaathi Ratnalu) సినిమాతో ఓవర్‌నైట్ క్రేజ్ సంపాదించింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో ఫరియాకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీ కానుంది ఫరియా. కాగా ఈ భామకు సంబంధించిన అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) లీడ్ రోల్లో నటిస్తోన్న బంగార్రాజు (Bangarraju)స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా మెరవనుందన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
హిప్ హాప్, హౌస్, బి-బోయింగ్, టుట్టింగ్, బెల్లీ డ్యాన్స్ స్కిల్స్ ఫరియాకు ఏ రేంజ్లో ఉన్నాయో ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వీడియోలను చూస్తే తెలుస్తుంది. ఫరియా డ్యాన్సింగ్ టాలెంట్‌ను తెరపై ఆవిష్కరించేలా పాట ఉండోతుందని టాలీవుడ్ టాక్. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేయడం కోసం ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఫరియా. మొత్తానికి తక్కువ టైంలోనే సీనియర్ హీరో సినిమాలో నటించే అరుదైన అవకాశం కొట్టేసింది ఫరియా అబ్దుల్లా.
ఇటీవలే అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో పెళ్లి కూతుళ్లలో ఒకరిగా నటించింది ఫరియా అబ్దుల్లా. మరి బంగార్రాజులో స్పెషల్‌సాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?