సినీ నటి, దర్శకురాలు, నృత్య దర్శకురాలు, స్క్రిప్ట్ రైటర్, టీవీ హోస్ట్, ప్రొడ్యూసర్.. ఇలా అనేక రంగాల్లో సత్తా చాటారు ఫరాఖాన్. అరుపదుల వయసులోనూ అందంగా, ఆరోగ్యంగా ఉంటూ అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తూ.. ‘నాకు రుచికరమైన వంటలంటే చాలా ఇష్టం. కానీ, తినడానికి పరిమితులు ఉండాలి. నేనైతే రోజుకు రెండుసార్లు తింటాను, అదీ మితంగా! మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తాను. సమయానికి తింటాను.
వాయిదాలు ఉండవు. రాత్రి పూట కచ్చితంగా ఏడున్నరకు డిన్నర్ చేస్తాను. ఇలా పరిమితంగా, నియమంగా తినడం వల్లే సన్నబడ్డాను. ‘ఝలక్ దిఖలా జా’ సీజన్ కంటే ముందు ఈ ఆహార నియమావళితోనే లావు తగ్గాను. దీర్ఘకాలం ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలోని నిల్వ కొవ్వులన్నీ కరిగిపోయి స్లిమ్‌గా అయ్యాన’ని ఫరా చెబుతున్నది. అందమె ఆనందం అన్నారు. ఫరా విషయంలో అందమే ఆరోగ్యం. ఐశ్వర్యం కూడా!