ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో జక్కన్న అండ్ టీం ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా కూడా చాలా క్రేజ్ ఏర్పడింది.
అయితే సినిమా ప్రమోషన్స్ కేవలం మీరు మాత్రమే చేస్తారా..? ఓ సారి మా ప్రమోషన్స్ కూడా చూడండి అంటూ రాంచరణ్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ అభిమానులు యూఎస్‌లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ వీడియోను ప్లే చేసి వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. న్యూయార్క్ సిటీలో నిత్యం రద్దీగా ఉండే టైమ్ స్వ్కేర్ బిల్ బోర్డు వద్ద ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన విజువల్స్ సంకలనంతో రూపొందించిన స్పెషల్ వీడియోను ప్రదర్శించి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
Aaatt!! 🔥🔥🤩 Celebrations on fire by USA @AlwaysRamCharan fans!! 😍 #RRRMovie pic.twitter.com/tNZwiOIMLL
— RRR Movie (@RRRMovie) March 17, 2022
ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అలియా భట్ సీత పాత్రలో నటిస్తుండగా..అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.