సోనూసూద్‌ని కలిసేందుకు హైదరాబాద్ నుండి ముంబైకి పాదయాత్ర

వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఎంతగా అలరించిన రియల్ లైఫ్‌లో ఆదుకున్నవాడే రియల్ హీరో. సిల్వర్ స్క్రీన్‌పై విలన్‌గా నటించిన సోనూసూద్ కరోనా కష్ట కాలంలో అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేస్తూ రియల్ హీరోగా కీర్తించబడుతున్నాడు. రాజకీయ నాయకులు సైతం అతనని రియల్ హీరో అంటూ ప్రశంలసు కురిపిస్తున్నారు. ప్రజలు అయితే అతనికి గుడులు కట్టి పూజలు చేస్తున్నారు.
తెలంగాణలోని పరిగి ప్రాంతానికి చెందిన సోనూసూద్ అభిమాని వెంకటేష్ తన అభిమాన నటుడిని కలిసేందుకు హైదరాబాద్ నుండి ముంబైకి పాదయాత్రగా బయలుదేరారు. అయితే పాదయాత్ర సమయంలో మీడియాతో మాట్లాడిన వెంకటేష్ .. లాక్డౌన్ కారణంగా నా తండ్రి నెలవారీ ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీని వలన ఫైనాన్స్ వారు నా తండ్రి ఆటోని స్వాధీనం చేసుకున్నారు. దీని వలన నా తండ్రి మానసికంగా కుంగిపోయారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. ఇప్పుడు తండ్రిని కోల్పోవాలని అనుకోవడం లేదు. అందుకే సోనూసూద్ సాయం కోసం పాద్రయాత్రగా బయలు దేరాను అని వెంకటేష్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- fan
- pada yatra
- sonu sood
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

