Fan War| కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న వార్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దారుణమైన బూతులు మాట్లాడుకుంటూ హీరోల పరువు దెబ్బతీస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లోను దారుణంగా నడిచింది. అయితే స్టార్ హీరోల అభిమానుల మధ్య ఈ వివాదాలు కాస్త సమసిపోయాయి అనుకుంటున్న సమయంలో ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య పెద్ద రచ్చే నడుస్తుంది. సోషల్ మీడియాలో నాని మీద విజయ్ దేవరకొండ అభిమానులు , అలానే విజయ్ దేవరకొండ మీద నాని అభిమానులు విరుచుకుపడుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్ మొదలవడానికి కారణం ఏమిటి అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. అయితే అసలు ఈ వివాదం ఎలా మొదలయిందంటే.. ఒక యూట్యూబర్, ప్రతి వారం విడుదలయ్యే సినిమాల మీద తన స్టైల్లో రివ్యూ ఇస్తూ.. మూడేళ్ల నుంచి ఒక హీరో మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుందని దీని వెనుక మరొక టైర్ 2 హీరో ఉన్నాడంటూ కామెంట్ చేశాడు. దాంతో ఇక అసలు రచ్చ మొదలైంది. విజయ్ దేవరకొండని నాని తొక్కేస్తున్నాడంటూ ట్రోలింగ్కి దిగారు. అసలు
విజయ్ దేవరకొండను తొక్కాల్సిన అవసరం నానికి ఉందా? నిజంగా యంగ్ హీరోలు తనకు కాంపిటీషన్ వస్తున్నారని నాని బలంగా భావిస్తున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విజయ్ దేవరకొండకు మొదటి నుండి నాని సపోర్టివ్‌గా ఉంటున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ విడుదల చేసింది నాని. ఆ వేడుకలో నానికి విజయ్ దేవరకొండ ముద్దు కూడా పెట్టాడు. ఇక నాని ఎవరి సినిమా విజయం సాధించిన విషెస్ చెబుతూనే ఉంటాడు. యంగ్ హీరోలను సపోర్ట్ చేయడంలో నాని ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.కాని కొందరు కావాలనే విజయ్ దేవరకొండ, నాని అభిమానుల మధ్య చిచ్చు పెడుతూ మంచి వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. ఎవరో ఒక యూట్యూబర్ చేసిన కామెంట్స్ పట్టుకుని ఇంత రచ్చ చేయాల్సిన పని లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.