Fan | తమిళ నాట విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు. ఇక విజయ్ ఇప్పుడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తుండడంతో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే విజయ్‌కి తాజాగా అనూహ్య ఘటన ఎదురైంది. ర్యాలీ చేస్తున్న సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా విజయ్ ర్యాలీ చేస్తున్న వాహనంపైకి దూకాడు. ముందు షాక్ కి గురైన విజయ్ ఆ తర్వాత అతనిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించాడు. ఈ సంఘటన కోయంబత్తూర్ ర్యాలీలో జరగగా, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమాల్లో సంచలనాలు సృష్టించిన విజయ్ ఇప్పుడు రాజకీయాలలో సరికొత్త సునామి సృష్టించబోతున్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తమిళ హీరో విజయ్.. తన పార్టీ సిద్ధాంతాలు ఏమిటో, ఎందుకోసం తాను రాజకీయాల్లోకి వచ్చానో ప్రజలకు తెలియజెప్పారు. రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం పూర్తి అవగాహనతో తీసుకున్నానన్న విజయ్.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. ఏ టీమ్, బీ టీమ్ అనే తప్పుడు ప్రచారాలతో టీవీకే పార్టీని ఓడించలేరని ప్రత్యర్థుల విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చారు.
హీరోగా కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే దానిని వదిలేసి మీ కోసం, మిమ్మల్ని నమ్మి మీ విజయ్‌గా మీ ముందు నిలుచున్నానంటూ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. రాజకీయాల్లో చిన్నపిల్లాడిని అని కొంతమంది అంటున్నారని.. చిన్నపిల్లాడిని అయినా రాజకీయం అనే పాముతో ఆడుకునే పిల్లాడినని, దేనికీ భయపడనంటూ విజయ్ తన శైలిలో స్పష్టం చేశారు.తనను సినిమా ఆర్టిస్ట్ అని కొందరు అంటుంటారు.. తమిళనాట ఎంజీఆర్.. ఏపీలో ఎన్టీఆర్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన సంగతిని ఆ సందర్భంగా గుర్తు చేశారు విజయ్.
Fan jumps like 🐿️ from a tree to catch Joseph Vijay during TVK road show. pic.twitter.com/O1cGkwHPbV
— Manobala Vijayabalan (@ManobalaV) April 26, 2025