టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం పుష్ప (Pushpa). సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఏదో ఒక అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తు,న్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil )కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఫహద్ ఫాసిల్ పుట్టినరోజు సందర్భంగా మరో కీలక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను అందించింది. ఇవాళ ఫహద్ ఫాసిల్ లుక్ ఒకటి మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఫహద్ ఫాసిల్ ఒంటి కన్నుతో కనిపిస్తుండగా..పోస్టర్ పై చెడు ఎప్పుడూ అంత ప్రమాదకరమైంది కాదు అంటూ క్యాప్సన్ ఇచ్చారు.
ఫహద్ ఫాసిల్ ఒంటికన్ను పోస్టర్ తో నే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాడు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ అవినీతి పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు టాక్ నడుస్తోంది. తాజాగా విడుదల చేసిన ఫహద్ ఫాసిల్ లుక్ సినిమాపై ఎంత ప్రభావం చూపుతుందనేది తెలియాలంటే క్రిస్మస్ వరకు ఆగాల్సిందే. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన దాక్కో దాక్కో మేక రషెస్ కు అద్బుతమైన స్పందన వస్తోంది.
రెండు పార్టులుగా తెరకెక్కుతున్న పుష్ప తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ కాబోతుంది. పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్. మిరోస్లా క్యూబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. దాక్కో దాక్కో మేక పాటను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.
Team Pushpa wishes it's antagonist, the supremely talented #FahadhFaasil a very Happy Birthday.
— BA Raju's Team (@baraju_SuperHit) August 8, 2021
#PushpaTheRise#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial @PushpaMovie
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/4oLU6y41ZP
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?