దేశమంతా సంచలనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ అనేక రికార్డులు తిరగరాయడం మనకు తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ పాత్ర ఎంత పాపులర్ అయిందో, ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కూడా అంతే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్. నెగెటివ్ షేడ్స్ లో నటించి అదరగొట్టాడు. మలయాళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ ఇందులో నెగెటివ్ పాత్ర పోషించడమే కాకుండా సినిమా కోసం ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడా అని అందరు ఆశ్చర్యపోయారు.
పుష్పలో ఫహద్ ఫాజిల్ పాత్రని సుకుమార్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడు. ‘పార్టీ లేదా పుష్పా?’ అంటూ తనదైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సెకండ్ పార్ట్ లో ఆయన పాత్రను కాస్త డౌన్ చేశారనే టాక్ వచ్చినప్పటికీ, ‘పుష్ప 2’ సక్సెస్ లో ఫహాద్ పాత్ర కూడా తప్పక ఉంటుంది. అయితే ఆయన ఆ పాత్ర కోసం నిజంగానే గుండు చేయించుకున్నాడని అందరు అనుకున్నారు. కాని అది రియల్ గుండు కాదని ఇన్ని రోజులకి తెలిసింది. యాక్టర్ బ్రహ్మాజీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేయగా, ఇది ‘పుష్ప 2’ సెట్స్ లోని బీటీఎస్ వీడియో . ఇందులో ఫహద్ బోట్ లో వెళ్తుండగా.. వెనుక నుంచి బ్రహ్మాజీ దాన్ని తన మొబైల్ ఫోన్ లో క్యాప్చర్ చేశాడు. ఇందులో మనం గమనిస్తే ఫహద్ నెత్తి మీద ముడుతలు చూడొచ్చు.
అంటే ఫహద్ ఫాజిల్ తలను గుండు మాదిరిగా మేకప్ చేసి కవర్ చేశారనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు అమ్మ.. షెకావత్ భలే మోసం చేశావుగా, ఇన్నాళ్లు అందరి నిజమైన గుండు అనుకున్నాము అని కామెంట్స్ చేస్తున్నారు. ఏప్రిల్ రాకముందే షెకావత్ అందరిని ఏప్రిల్ ఫూల్ చేశాడు. ‘పుష్ప 2’ ఫైట్ బీజీఎమ్ అంటూ బ్రహ్మాజీ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పుష్ప2 సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచిన విషయం తెలిసిందే.