12A Railway Colony | టాలీవుడ్ యాక్టర్ అల్లరి నరేశ్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘12A రైల్వే కాలనీ’. థ్రిల్లర్జోనర్లో వస్తోన్న ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తుండగా.. డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
ఎక్కువగా కామెడీ సినిమాలెందుకు చేయడం లేదని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి అల్లరి నరేశ్ స్పందిస్తూ.. కామెడీ సినిమాలు తీయాలంటే ఇప్పుడు చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. మేం ఒకవేళ ఇప్పుడు కితకితలు చేస్తే.. బాడీ షేమింగ్‌తో సినిమాను పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు చాలా సున్నితంగా మారాయి. కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశముంది. ఈ రోజుల్లో మనం కలర్, బరువుతోపాటు ఇతర సున్నిత అంశాలపై మాట్లాడకూడదన్నాడు అల్లరి నరేశ్.
ప్రేక్షకుల అభిరుచి ప్రతీ పది సంవత్సరాల కోసారి మారుతూ వస్తుంది. నేను గతంలో రైమింగ్ డైలాగ్స్, కౌంటర్స్‌తో సాగేకామెడీ సినిమాలు చేసేవాడిని. సుడిగాడు స్పూఫ్ సినిమా. ప్రేక్షకులు కూడా ప్రతీ కంటెంట్‌పై స్పూఫ్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జోకులు ఖచ్చితంగా ఆర్గానిక్‌గా ఉండాలి. వాటిని సోషల్ మీడియా మీమ్స్‌ను నుంచి అస్సలు కాపీ చేయొద్దు. జనాలు ఇప్పుడు ఆర్గానిక్‌గా ఉండే సెన్సిబుల్ కామెడీని ఆశిస్తున్నారని చెప్పుకొచ్చాడు అల్లరి నరేశ్.
ఈ చిత్రంలో సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ ఫేం డాక్టర్ అనిల్విశ్వనాథ్ కథ, స్కీన్‌ప్లే, సంభాషణలు సమకూరుస్తున్నారు.
Andhra King Taluka | రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ రిలీజ్
AnnaGaruVostaru | వా వాతియార్ తెలుగు టైటిల్ ఇదే.. హైప్ పెంచుతోన్న కార్తీ నయా లుక్