హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత(బాహుబలి) విజయేంద్రప్రసాద్ గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని(Secretariat ) సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పద్దతులను ప్రశంసించారు. భావితరాలకు దిక్సూచిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(CM KCR) అంబేద్కర్ సచివాలయాన్ని ముందు చూపుతో అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.
అతి తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్‌తో సచివాలయాన్ని నిర్మించారని కొనియాడారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ప్రముఖ నిర్మాత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కొణతం లక్ష్మణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ తదితరులు ఉన్నారు.