Niharika Konidela | స్వీయ నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంగీత్శోభన్, నయన్సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానసశర్మ దర్శకురాలు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు నాగ్అశ్విన్ క్లాప్‌నివ్వగా, వశిష్ట కెమెరా స్విఛాన్ చేశారు. ఫాంటసీ, కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది.
ఈ నెల 15 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత నిహారిక కొణిదెల తెలిపారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, అశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్‌దేవ్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: మానసశర్మ, మహేష్ ఉప్పాల, నిర్మాత: నిహారిక కొణిదెల, దర్శకత్వం: మానసశర్మ.