‘మా మనవడు పరుచూరి సుదర్శన్ కథానాయకుడిగా వచ్చిన ‘మిస్టర్ సెలబ్రిటీ’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సెలబ్రిటీలపై పుకార్లు, వాటి పర్యవసానాలపై కథను అల్లుకొని దర్శకుడు రవికిశోర్ సినిమాను అద్భుతంగా తీశాడు. ట్విస్ట్ కూడా అందరికీ నచ్చింది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. చూడనివారుంటే చూడండి.’ అని ప్రఖ్యాత రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘మిస్టర్ సెలబ్రిటీ’. రవికిశోర్ దర్శకుడు. చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ చిత్రయూనిట్‌కి అభినందనలు అందించారు. కథను నమ్మి చేసిన సినిమా ఇదని, నటుడిగా సుదర్శన్‌కి మంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉందని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర సినిమాకు ప్రధాన బలమని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాత పాండురంగారావు కూడా మాట్లాడారు.