బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సంచలనాలు సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ వరుస ప్రోమోలతో సందడి చేస్తున్నారు.
రీసెంట్గా ఓ ప్రోమో విడుదల కాగా, ఇందులో ఓ ప్రైవేట్ లెక్చరర్ .. ఈ షో వల్ల రూ.25 లక్షలు గెలుచుకుంటాడు. అయితే ఆ డబ్బులో సగం విద్యార్థుల ఫీజలకు ఉపయోగిస్తానని చెప్తాడు. చివరికి ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’అని చెప్పుకొస్తాడు.
ఇక తాజాగా మరో ప్రోమో రిలీజ్ చేశారు.ఆగస్ట్ నుండి ఈ షో మొదలు కానుందని తెలియజేస్తూ.. ఈ ప్రోమో ద్వారా మరింత ఆలోజింపజేశారు.అందరు పెద్దయ్యాక పోలీస్, డాక్టర్, కలెక్టర్ అవుతామని చెబుతుంటే ఓ మహిళ మాత్రం అమ్మని అవుతానని చెప్పింది. రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది.
ఆమె మాటలు విన్న తర్వాత ఎన్టీఆర్ హృదయం కూడా కరిగింది. దీంతో ఆయన ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.