వెండితెరపైనే కాదు బుల్లితెరపైన సంచలనాలు సృష్టిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ తొలి సీజన్‌కు హోస్ట్‌గా ఉన్న ఎన్టీఆర్ షోను రక్తికట్టించారు. ఇక తర్వాతి సీజన్స్‌కు ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని నిర్వాహకులు భావించినప్పటికీ కొన్ని పరిస్థితుల వలన అది కుదరలేదు. అయితే కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే రియాలిటీ షోను గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ కార్యక్రమానికి సంబంధించి కొన్ని ప్రోమోలు కూడా విడుదల చేశారు. ఇక షో మరి కొద్ది రోజులలో ప్రసారం కానుంది అనుకునే సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో షో తాత్కాలిక వాయిదా పడింది. అయితే రానున్న రోజులలో ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉండగా, ఈ కార్యక్రమానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టంగా ఉంటుందని, ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’కు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పినట్టే అనేక పుకార్లు వినిపించాయి. ఈ క్రమంలో జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి రూమర్లకు చెక్ పెట్టింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని ప్రోమో ద్వారా తెలిపింది. ఈ షో ఆడుతున్న వారి కలలను నెరవేరేఉస్తుంది. చూస్తున్న వారికి వందశాతం వినోదం అందిస్తుందని కూడా పేర్కొంది.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
— Gemini TV (@GeminiTV) June 5, 2021
Aadutunna valla kalalanu neraverustundi, itu chustunna vallaki 100 % Entertainment istundi EMK#EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu @tarak9999. pic.twitter.com/GtbKnRJQla