Heroine | సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. ఇటీవలి కాలంలో దీని గురించి ఎక్కువగా మనం వింటున్నాం. పలువురు నటీమణులు పలు సందర్బాలలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు. ఒకప్పుడు లైంగిక వేధింపుల గురించి ఎవ్వరు అంతగా మాట్లాడలేదు కాని ఈ మధ్య మాత్రం ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కున్న సమస్యలను బయట పెడుతున్నారు.. తాజాగా ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్స్ అడుగుతారని.. సినిమా ఛాన్స్‌ల కోసమే కాదు షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కు కూడా కమిట్మెంట్ అడుగుతారని చెప్పి పెద్ద బాంబ్ పేల్చింది.
సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఎస్తేర్ నోరోన్హా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు 2013లో పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ‘1000 అబద్దాలు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీతో ఈ అమ్మడుకు అంత గుర్తింపు రాలేదు. ఆ తరువాత ‘భీమవరం బుల్లోడు’సినిమాలో నటించి.. ఓ మాస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఎస్తర్ నోరోన్హ కు అనుకున్న స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. జయ జానకి నాయక, జులియెట్ లవర్ ఆఫ్ ఇడియట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఏ చిత్రం కూడా మంచి విజయం సాధించలేదు.
చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ఈ అమ్మడు. సింగర్ నోయల్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతని నుండి విడిపోయి మీడియా ముందుకు వచ్చి చాలా హంగమా చేసింది. పెళ్లైన కేవలం 16 రోజులకే వారికి మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆరు నెలలకే తమ వివాహ బంధాన్ని తెంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ నోరోన్హా మాట్లాడుతూ ..హీరోయిన్ గా ఎదగాలంటే చెడ్డ దారిలో వెళ్లి త్వరగా స్టార్ అవ్వొచ్చు.. కానీ అది నాకు ఇష్టం లేదు. మిగతా హీరోయిన్స్ మాదిరిగా నేను కమిట్మెంట్స్కి ఒప్పుకొని ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యే దానిని. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవానికి కూడా కమిట్మెంట్స్ అడుగుతారు అందుకే నేను వాటికి కూడా దూరంగా ఉంటాను అని ఎస్తేర్ పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.