ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొందరు తనను ‘బాడీ షేమింగ్’ చేసినట్లు చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఈశా దేవుల్. బీటౌన్ స్టార్‌కపుల్ ధర్మేంద్ర – హేమమాలిని కూతురిగా చిత్రసీమలో అరంగేట్రం చేసింది ఈశా. తన మొదటి సినిమా సందర్భంగానే.. తాను బాడీ షేమింగ్‌కు గురయ్యానని చెప్పింది. మొదట్లో తాను కొంచెం చబ్బీగా ఉండేదాన్ననీ.. దాంతో తన బరువు, ఫ్యాట్ గురించి కొందరు హేళన చేసేవారని చెప్పుకొచ్చింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈశా మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. కానీ, అందరూ నన్ను అప్పటికే 200కు పైగా సినిమాలు చేసిన మా అమ్మతో పోల్చి చూసేవారు. చూసేందుకు నేను మా అమ్మలాగే ఉండేదాన్ననీ అనేవారు” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. అయితే, తాను మాత్రం ఆ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపించాననీ, ఆ పాత్రకు తగిన న్యాయం చేశాననీ వెల్లడించింది.