మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కలబోతగా రూపొందుతోన్న చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. సీనియర్నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయితేజస్విని ప్రధాన పాత్ర పోషిస్తున్నది. సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్.వి.వి.సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్ నిర్మాతలు.
డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో మొత్తం 22 పాత్రలుంటే, ఎర్రచీర 23వ పాత్ర పోషిస్తున్నదని, 45 నిమిషాల గ్రాఫిక్స్ హైలైట్‌గా నిలుస్తాయని, బేబీ సాయితేజస్వి నటన అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శక, నిర్మాత సుమన్‌బాబు చెప్పారు.