RC17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపుదిద్దుకోబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం #RC17 మ్యూజిక్ డైరెక్టర్ మార్పుకు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) తప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘రంగస్థలం’ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో, దేవిశ్రీ ఈ ప్రాజెక్ట్‌లో లేరనే ప్రచారం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ షాకింగ్ మార్పు వెనుక ఇటీవల విడుదలైన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం సమయంలో తలెత్తిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మరియు రీ-రికార్డింగ్ పనులలో అనుకున్న సమయానికి అవుట్‌పుట్ రాకపోవడం, ఆ కారణంగా ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల సేవలను సుకుమార్ ఉపయోగించుకోవాల్సి రావడం వంటి పరిణామాల వల్లే దేవిశ్రీతో సుకుమార్ బంధానికి బ్రేక్ పడిందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలోనే దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో సరికొత్త సంగీతాన్ని అందించేందుకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్దేవ్తో పాటు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా సాయి అభ్యంకర్ ల పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
2024 హోలీ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పుడు పోస్టర్‌పై దేవిశ్రీ ప్రసాద్ పేరే ఉన్నప్పటికీ, తాజా మార్పులపై మైత్రీ మూవీ మేకర్స్ లేదా సుకుమార్ టీమ్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా సిద్ధం చేసే పనిలో ఉండగా, రామ్ చరణ్ తన ప్రస్తుత చిత్రం ‘పెద్ది’ పూర్తయిన తర్వాత దసరా సీజన్ ముగిశాక ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది, అప్పటివరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ సస్పెన్స్‌కు తెరపడకపోవచ్చు.