రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో దోపిడీ!
కోర్టు ఆర్డర్ల సాకుతో ప్రభుత్వ, అటానమస్ కాలేజీలు ఫీజుల పేరుతో జులుం ప్రదర్శించడం, నిరుపేద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ ప్రైవేట్ దోపిడీ పాలన సాగిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నరు
- ఎమ్మెల్సీ దాసోజు ధ్వజం
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కోర్టు ఆర్డర్ల సాకుతో ప్రభుత్వ, అటానమస్ కాలేజీలు ఫీజుల పేరుతో జులుం ప్రదర్శించడం, నిరుపేద విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ముసుగులో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతూ ప్రైవేట్ దోపిడీ పాలన సాగిస్తున్నదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ప్రైవేట్ కళాశాలలకు ఇచ్చిన ఊరటను అడ్డుపెట్టుకొని, ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే నిజాం కాలేజీ, కోఠి మహిళా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలతోపాటు ఇతర అటానమస్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తేవడం హేయమైన చర్య అని పేరొన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రానందుకు విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడం అక్రమమని అన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారం ఎలాంటి ఆర్థిక బకాయిల కోసమూ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేదని గుర్తుచేశారు.
చేతిలో సర్టిఫికెట్లు లేక వేలాదిమంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ, విదేశీ విద్య అడ్మిషన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం చట్టవిరుద్ధమని విద్యా శాఖ ద్వారా వెంటనే కఠినమైన ఉత్తర్వులు జారీ చేయాలని చేశారు. ఫీజులతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లు అందజేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

