Emraan Hashmi | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఓజీ. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీతో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు.
కాగా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తుండటం.. అందులోనా పవన్ కల్యాణ్ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం పట్ల చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నాడు ఇమ్రాన్ హష్మీ. ఓజీ గురించి ఇమ్రాన్ హష్మీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు థ్రిల్లింగ్‌గా ఫీలయ్యా. ఇది నాకు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ సినిమా. లెజెండరీ పవన్ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కంటే ఉత్తమ విషయం ఇంకేముంటుందన్నారు.
పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజిత్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. నా లుక్, డైలాగ్ డెలివరీ నుంచి పూర్తి క్యారెక్టరైజేషన్ వరకు ప్రతీ విషయం నన్ను ఇంప్రెస్ చేయడంతో నిజంగా ఈ సినిమాలో భాగం కావడానికి ఎక్జయిట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓజీ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా తెలుగుతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్