యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారనే విషయం మనందరకి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఇద్దరిని ఒకే వేదికపై చూసి అభిమానులు మురిసిపోయారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు.
ఇటీవల దీని ఫైనల్ ఎపిసోడ్ షూట్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.దసరాకి ఈ షో ప్రసారం అవుతుందని అందరు భావించారు. కాని సమంత ఎపిసోడ్ ప్రసారం అయింది. ఇక దీపావళికి వస్తుందేమోనని అందరు భావించగా, అది కూడా వాయిదా పడ్డట్టే అని వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ ను నవంబర్ 18న ప్రసారం కానున్న ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు(Mahesh Babu) కనిపించబోతున్నారని అంటున్నారు.
ఈ గేమ్ షో మొదటి ఎపిసోడ్లో గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఆ తర్వాత టాప్ డైరెక్టర్స్ కొరటాల శివ, రాజమౌళి లు కూడా ఈ షోకు వచ్చి సందడి చేశారు. ఈ షోలో సమంత కూడా వచ్చి సందడి చేసింది. తన మనస్సులో మాటను బయటపెట్టింది.