Elimination | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ రౌండ్ హాట్ హాట్‌గానే సాగింది. ఈసారి ప్రత్యేకంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్లీ హౌస్‌లోకి వచ్చి, ఒకరిని నేరుగా నామినేట్ చేయడమే కాకుండా, మరో కత్తి ద్వారా తమకు నచ్చిన వారిని సరైన కారణాలతో నామినేట్ చేసే అవకాశం పొందారు.ఈ నామినేషన్ రౌండ్‌తో హౌస్‌లో వాదోపవాదాలు రగిలాయి. శ్రీజ–మాధురి, తనూజ–ఇమ్మాన్యుయెల్ మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, సంజన–సుమన్ శెట్టి మధ్య కెప్టెన్సీ విషయంలో హీట్ పెరిగింది. ముఖ్యంగా సుమన్.. సంజన తన కెప్టెన్సీని పట్టించుకోలేదన్న కారణంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఫైనల్‌గా ఈ వారం హౌస్ నుంచి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో మాధురి, సంజన, కళ్యాణ్, రీతు, తనూజ, రాము, డీమాన్ పవన్, గౌరవ్. వీరిలో మాధురి, రాము డేంజర్ జోన్లో ఉన్నారు. మాధురి ఈ సీజన్లో తన ఆగ్రెసివ్ నేచర్‌తో ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంది. హౌస్‌లో ఆమె వ్యవహారం విచిత్రంగా ఉంది. “బిగ్ బాస్ రూల్ కాదు, నా రూల్ పాటించాలి” అన్నట్లు ఉందని కొంతమంది కంటెస్టెంట్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్ లేకపోయినా, ఆమె ఎటాకింగ్ నేచర్ ప్రేక్షకుల్లో మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చింది. ఇక రాము రాథోడ్ విషయానికి వస్తే బయట సింగర్, డాన్సర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్నా, హౌస్‌లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. టాస్క్‌లలోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోవడం ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తోంది.
మాధురి, రాము కాకుండా సంజన, గౌరవ్, రీతు కూడా ఈ వారం డేంజర్ జోన్‌కు దగ్గరగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు తనూజ, పవన్, రీతు మాత్రం సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నది ప్రేక్షకుల ఓటింగ్‌పై ఆధారపడి ఉంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్ లో దూసుకుపోతుండడం విశేషం. ఇక డిమాన్ పవన్, రీతూ చౌదరి లాస్ట్ లో ఉన్నారు. అలాగే మాధురి కూడా ఓటింగ్‌లో లాస్ట్ లో ఉంది.. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురి నుంచి ఒకరు బయటకు వచ్చేస్తారు. వాదనలు, భావోద్వేగాలు, వ్యూహాలతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ పూర్తిగా హిటెక్కింది.