Pathaan movie | బాలీవుడ్ స్టార్నటుడు షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాటలో దీపికా ధరించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంతరంతో పాటు అశ్లీలం మోతాదు మించిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ మధ్యప్రదేశ్‌లో కొందరు ఆందోళనకు దిగారు. ‘వీర్ శివాజీ గ్రూప్’ కార్యకర్తలు ఇండోర్‌లోని ప్రధాన కూడలిలో నిరసన చేపట్టారు. షారుక్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
కాగా ఈ సినిమాపై నిషేధం విధించాలని బుధవారం మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా కోరిన విషయం తెలిసిందే. ఈ మూవీలో కాషాయ దుస్తులను వాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని, ఈ సీన్లను మార్చనిపక్షంలో మధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.
యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్ అబ్రహాం మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ‘పఠాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
मध्य प्रदेश के इंदौर में जलाया गया शाहरुख़ खान का पुतला।
पठान फ़िल्म में भगवे रंग का किया गया है अपमान। pic.twitter.com/8HF95rvBb5
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) December 15, 2022