ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ముఖ్య పాత్రధారులుగా రూపొందిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అయి ప్రజాదరణ పొందిన ఈ సిరీస్‌కు సీజన్-2 రానుంది. కిరణ్ కె.కరవల్ల దర్శకుడు. అగ్ర దర్శకుడు మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్కేఎన్ నిర్మాత. డిసెంబర్ 12 నుంచి ఈ సెకండ్ సీజన్ ఆహాలో స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది.
ఈ సందర్భంగా ఈ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. కిరణ్ కె.కరవల్ల మాట్లాడుతూ ‘ ఆద్యంతం వినోదభరితంగా సాగే సిరీస్ ఇది’అని తెలిపారు. స్టార్ డైరెక్టర్ మారుతి ఇచ్చిన కాన్సెప్ట్ ఇదని, సీజన్1ని మించి ఈ సీజన్ 2 ఉంటుందని నిర్మాత ఎస్కేఎన్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కథానాయికలు ఈషా రెబ్బా, రాశీ సింగ్, కుషిత కల్లపులతో పాటు రైటర్ సందీప్ బొల్ల, నటుడు సూర్యశ్రీనివాస్, ఆహా ప్రతినిధులు రాజేశ్ వాసిరెడ్డి, కవిత కూడా మాట్లాడారు.