Eesha Rebba | హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలెంట్ ఉన్నప్పటికీ సరైన బ్రేక్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జయ జయ జయహే’ సినిమాను తెలుగులో రీమేక్‌గా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 30న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా కంటే ఎక్కువగా ఈషా రెబ్బా – తరుణ్ భాస్కర్ మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
వీరిద్దరూ కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం, పబ్లిక్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తాజాగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఈషా రెబ్బా ఈ డేటింగ్ రూమర్స్‌పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీరిద్దరూ రియల్ లైఫ్‌లో కూడా జంటేనా అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, “ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే. కానీ ప్రతిదానిపైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా నిజంగా ఉంటే నేనే ముందుగా అందరికీ చెప్తాను” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అయితే, తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టు తెలియజేసిన ఈషా, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు.
మరోవైపు సినిమా షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో తనను తరుణ్ భాస్కర్ నిజంగానే కొట్టాడని ఆమె చెప్పుకొచ్చింది. “ఒక సీన్లో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పారు. అప్పుడు తరుణ్ భాస్కర్ నిజంగానే గట్టిగా కొట్టాడు. నేను అస్సలు ఊహించలేదు. ఆ క్షణంలో తెలియకుండానే నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి” అంటూ ఆమె అనుభవాన్ని పంచుకుంది. ఈ వ్యాఖ్యలు తర్వాత సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది. మొత్తానికి ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా విడుదలకు ముందే ఈషా రెబ్బా వ్యక్తిగత జీవితం, ఆమె చేసిన కామెంట్స్ కారణంగా విపరీతమైన ప్రచారం దక్కించుకుంటోంది.