Heroine | సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. సినిమాలకి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితం, ప్రేమ సంబంధాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, హీరోయిన్ ఈషా రెబ్బ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశం అయ్యాయి.ఈ ఇద్దరు ఇప్పటికే తిరుమలకు కలిసి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌లో ఈ జంట కలిసి కనిపించింది. ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవ్వగానే అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు. మరి ఈ వార్తలపై వారు ఏమైన స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
ఇక హీరోయిన్ ఈషా రెబ్బ తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్, స్పెషల్ రోల్స్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ సినిమాలో సిస్టర్ పాత్రలో మెప్పించింది. పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలలో నాటకాలు చేసి, కొన్ని చిత్రాల్లో కొంచం బోల్డ్ పాత్రలలో కూడా నటించింది. అందం, టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో ఈషాకి సరైన బ్రేక్ రావడం లేదు. మంచి హిట్ ఒక్కటి వచ్చిన ఈషా లైఫ్ టర్న్ కావడం ఖాయం అంటున్నారు.
అయితే డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈ భామ ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఒకేచోట కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడం ఈ వార్తలకు మళ్లీ ఊపందించింది. అభిమానులు ఈ జంట గురించి ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు . తరుణ్ భాస్కర్ ఇప్పుడు దర్శకుడిగానే కాకుండా నటుడిగాను సందడి చేస్తున్నారు. త్వరలోనే ఈషారెబ్బా హీరోయిన్గా తరుణ్ భాస్కర్ ఓ చిత్రం చేయనున్నాడనే టాక్ వినిపిస్తుంది.