Mucherla Aruna | అలనాటి నటి ముచ్చర్ల అరుణ(Mucherla Aruna) నివాసంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఆమె ఇంటిలో ఈ తనిఖీలు జరిగాయి. అరుణ భర్త మోహన్ గుప్తా వ్యాపారాలకు సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. మోహన్ గుప్తా ఇంటీరియర్ డిజైన్, నివాస నిర్మాణ ప్రాజెక్టులు చేసే సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపార కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీని ఆధారంగానే ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే, ఈడీ అధికారులు ఈ తనిఖీల్లో ఎలాంటి కీలక పత్రాలు లేదా అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారా లేదా అనే దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సోదాలు పూర్తయిన తర్వాత ఏజెన్సీ నుండి పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.