Tamil film director Shankar | తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. 2010లో శంకర్ దర్శకత్వంలో వచ్చి విడుదలైన రోబో కాపీ రైట్ సినిమా విషయంలో మానీలాండరింగ్ కింద శంకర్‌కి చెందిన రూ.10 కోట్లకు పైగా విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. తమిళనాడుకి చెందిన అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి తన జిగుబా పుస్తకంలోని కథను కాపీ కొట్టి శంకర్ రోబో తెరకెక్కించినట్లు 2011లో ఎగ్మోర్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. 1957 కాపీరైట్ యాక్ట్ ఉల్లంఘించిన నేపథ్యంలో శంకర్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తమిళనాథన్ పేర్కొన్నాడు.
అయితే ఈ పిటిషన్‌పై ఎగ్మోర్ కోర్ట్ తాజాగా విచారణ చేప్పట్టింది. ఈ కేసు విషయంలోనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా -FTII నివేదిక కూడా శంకర్ వ్యతిరేకంగా రావడంతో పాటు జిగుబా కథ రోబో సినిమాకి దగ్గర పోలికలున్నాయని తెలిపింది. దీంతో శంకర్ కాపీరైట్లోని సెక్షన్ 63ను ఉల్లంఘించినట్టు ఈడీ స్పష్టం చేసింది. అలాగే రోబో సినిమాకు పారితోషకంగా 11.5 కోట్ల రూపాయలను శంకర్ అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.