Christmas | డిసెంబర్ వచ్చిందంటే చాలు.. అంతా సంబరాల్లో మునిగిపోతారు. ఎందుకంటే ఈ నెలలో రెండు ప్రత్యేకతలు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్. ఈ రెండు వేడుకలకు వారం ముందు నుంచే అంతా పండగ వాతావరణంలో మునిగి తేలుతుంటారు. ఇక సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన పనే ఉండదు.. ముందస్తు క్రిస్మస్ వేడుకలు, డిన్నర్లు, నైట్ పార్టీలు అంటూ అంతా ఒకచోటచేరి తెగ సందడి చేస్తుంటారు. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అయితే, తాజాగా అల్లు-మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సందడి మూడు రోజులు ముందే వచ్చింది. ఇరు కుటుంబ సభ్యులు ఒక చోట చేరి ముందస్తు క్రిస్మస్ వేడుకలను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, రామ్‌చరణ్-ఉపాసన, అల్లు బాబీ దంపతులతోపాటు.. అల్లు శిరీష్, కొణిదెల సిస్టర్స్ నిహారిక, శ్రీజ, సుష్మిత, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తదితరులు ఒకచోట చేరి ముందస్తు క్రిస్మస్ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మెగా-అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్లోచూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.