House of the Dragon | ‘గాట్’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది
House of the Dragon | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones – GOT). వెబ్‌సిరీస్‌ల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇక ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' (GOT) అని చెప్పక తప్పదు.
House of the Dragon | ఓటీటీలలో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అక్కర్లేని లేని పేరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ (Game of Thrones – GOT). వెబ్‌సిరీస్‌ల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ఇక ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (GOT) అని చెప్పక తప్పదు. మనీ హెయిస్ట్ (Money Heist), స్క్విడ్ గేమ్ (Squid Game), బ్రేకింగ్ బ్యాడ్ (Breaking Bad), స్ట్రేంజర్ థింగ్స్, మీర్జాపూర్, బే వాచ్ లాంటి పాపులర్ సిరీస్‌లు కూడా ఈ సిరీస్‌ను ఇప్పటివరకు బీట్ చేయలేక పోయాయి. అంతలా ఓటీటీ ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసింది ఈ సిరీస్. అయితే ఈ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా గాట్ మేకర్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ (House of the Dragon) సీజన్ 1 తెరకెక్కించారు. 2022లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దుమ్ములేపింది. అయితే ఈ సిరీస్ సీజన్ 2కు సంబంధించి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. కింగ్ విసెరీస్ టార్గారియన్ మరణం తరువాత అతని భార్య అలిస్సా తన కుమారుడు ఏగాన్ టార్గారియన్ను కొత్త రాజుగా ప్రకటించిన విషయం తెలిసిందే, మరోవైపు విసెరీస్ కుమార్తె రెనెరియా టార్గారియన్ తనను తాను రాణిగా ప్రకటించుకుంది. అయితే రెండో సీజన్లో ఐరన్ థోర్న్ కోసం (సింహాసనం) ఈ రెండు గ్రూపుల మధ్య యుద్ధం జరుగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సీజన్లో ఐరన్ థోర్న్ ని దక్కించుకునేది ఏవరు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సిరీస్‌కు అలాన్ టేలర్ (Alan Taylor) దర్శకత్వం వహిస్తుండగా.. మాట్ స్మిత్, ఒలివియా కుక్, ఎమ్మా డి’ఆర్సీ, ఈవ్ బెస్ట్, స్టీవ్ టౌసైంట్, ఫాబియన్ ఫ్రాంకెల్, ఇవాన్ మిచెల్, టామ్ గ్లిన్-కార్నీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 16 నుంచి ప్రపంచవ్యాప్తంగా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా.. ఇండియాలో జియో సినిమా (Jio Cinema) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

