Dunki Movie | షారుఖ్ ఖాన్ బర్త్ డే గిఫ్ట్.. మోస్ట్ అవైటెడ్ ‘డంకీ’ టీజర్ వచ్చేసింది.!
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు.
Dunki Movie | ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan). పఠాన్ (Pathaan), ‘జవాన్’ (Jawan) సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. రీసెంట్గా విడుదలైన ‘జవాన్’ (Jawan) సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.1150 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’ (DUNKI). మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ (Tapsee) కథనాయికగా నటిస్తుంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ రాకపోవడం విశేషం. ఇదిలా ఉంటే.. నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It’s an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023
యునైటెడ్ కింగ్డమ్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలకు ఇల్లీగల్‌గా వెళ్లాలనుకునేవారు ఎలాంటి కష్టాలని ఫేస్ చేసారు అనేదే డంకీ కథ. ఇక ఇండియా నుంచి ఇంగ్లాండ్‌కు చట్టవిరుద్ధంగా వెళ్లే షారుఖ్ అండ్ అతని గ్యాంగ్‌కు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది డంకీ కథ అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. రాజ్ కుమార్ హిరానీ ముందు మూవీస్ లానే డంకీలో కూడా కామెడీ ఉంటుందని తెలుస్తుంది. హార్డీ పాత్రలో షారుఖ్ నటిస్తుండగా.. మనుగా తాప్సి నటిస్తుంది.
డ్రామా, రొమాన్స్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జియో స్టూడియోస్ (Jio Studios), రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillis Entertainment), రాజ్‌కుమార్ హిరానీ (Raj Kumar Hirani Films) ఫిల్మ్స్ బ్యానర్లో హిరానీ, గౌరీ ఖాన్ (Gauri Khan) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బోమన్ ఇరానీ (boman Irani), విక్కీ కౌశల్ (Vicky Kaushal) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

